టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌లలో ఒకరు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరిసన కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది.
ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు నాలుగు తమిళ్ మూవీస్ ఉన్నాయి. అలాగే ఇటీవల రాశి ఖన్నా తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి మాట్లాడుతూ తమిళ్ ఇండస్ట్రీ పై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. తమిళ్ పరిశ్రమంలో ఫస్ట్ ఇంపార్టెన్స్ టాలెంట్ గా ఇస్తారని, సెకండ్ ప్రయారిటీ మన అందానికి ఇస్తారని వివరించింది.
క్యారెక్టర్‌కి కరెక్ట్ అనుకుంటే సక్సెస్ గురించి వాళ్ళు ఆలోచించరు అంటూ చెప్పుకొచ్చింది. దేశంలో అన్ని పరిశ్రమలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. నాకు లైఫ్ తెలుగు సినిమాలతో వస్తే.. నటనలో ఆకలి తమిళ్ సినిమానే తీర్చిందని చెప్పుకొచ్చింది. తమిళ్ ఇండస్ట్రీలో నాకు మంచి మంచి పాత్రలు దొరుకుతున్నాయని తన ఆనందాన్ని షేర్ చేసుకుంది.