ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్న స్టార్ హీరోయిన్.. కారణం..?

చాలామంది సెలబ్రిటీలు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి సక్సెస్ అయిన తర్వాత భారీగానే ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది సెలబ్రిటీలు ఇతరత్రా భూములపైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది పన్నులు చెల్లించలేక పలు రకాల వాటిని సైతం కొనుగోలు చేస్తూ ఖర్చులను చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన ప్రియాంక చోప్రా ఉన్న ఆస్తులను సైతం అమ్మేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.


ముఖ్యంగా ఇండియాలో ఉన్న ఒక ప్రాపర్టీని సేల్ పెట్టి మరి డబ్బును తమ ఖాతాలో జమ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోఖండ్ వాలో ఉన్న ప్రాపర్టీని అమ్మేసి 7 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా అందేరియాలో ఉన్న అపార్ట్మెంట్ ని కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ ని దర్శకనిర్మాత అభిషేక్ బౌచే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం గత నెల 23,25 తేదీలలో ఇందుకు సంబంధించి లావాదేవీలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని మొత్తం ప్రియాంక చోప్రా తల్లి దగ్గరుండి చూసుకుందట.ప్రియాంక చోప్రా ఇలా వరుస పెట్టి అమ్మడంతో ఈమె ఇండియా వదిలి పూర్తిగా అమెరికాలోనే స్థిరపడేలా ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమె అమెరికన్ పౌరసత్వం కూడా తీసుకోందట .తన భర్త నిక్ జొనష్ తో కలిసి ఈమె చాలాకాలంగా ఉంటోంది. పెళ్లయిన తర్వాత ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా కాపురం మొదలుపెట్టి ఒక పాపకు జన్మనిచ్చింది..హాలీవుడ్ బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంటోంది.