” నాకు పెళ్లయిన తర్వాత ఆ ఒక్కటే మారింది… సాయంత్రం 6 తరువాత తప్పకుండా అలా చేయాల్సిందే “… హన్సిక సెన్సేషనల్ కామెంట్స్..!!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమె ప్రియుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనంతరం సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. ప్రస్తుతం హన్సిక ” మై నేమ్ ఈస్ శృతి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో శ్రీనివాస్, ఓంకార్ రూపొందిస్తున్నారు.బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హన్సిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.

” పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ ఏం మారలేదు. షూటింగ్ టైం లో సినిమాలోని క్యారెక్టర్లు ఉంటాను. ఇంటికెళ్లిన తరువాత నా భర్తతో ఉంటా అంతే తేడా. ఇక సాయంత్రం 6 తర్వాత నా భర్తతో కచ్చితంగా గడుపుతాను. అలాగే మెయిన్ గా నా మ్యారేజ్ తరువాత నా అడ్రస్ మాత్రమే మారింది. నా ఇంటి పేరు కూడా మారలేదు. ఎందుకంటే హన్సిక మోత్వానీ అని ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు ” అంటూ పేర్కొంది. ప్రస్తుతం హన్సిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.