ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ సెవెన్ బుల్లితెరపై ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కంటెంట్ గా పాల్గొన్న శివాజీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈసారి సీజన్లో శివాజీనే టైటిల్ విన్నర్ అంటూ టాక్ వినిపిస్తుంది. కాగా శివాజీ మొదట్లో టాలీవుడ్ హీరోగా పరిచయమై ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. అయితే శివాజీ స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పారని సంగతి చాలామందికి తెలియదు.
శివాజీ ఓ పక్కన యాక్టర్ గా నటిస్తూనే మరో పక్కన కొంతమంది యంగ్ హీరోలకు డబ్బింగ్ చెప్పారు. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. వాళలో యంగ్ హీరో నితిన్ ఒకరు. జయం సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న నితిన్ కు ఈ సినిమాల్లో డబ్బింగ్ చెప్పింది శివాజీనే. అలాగే నితిన్ దిల్, సంబరం సినిమాలకు డబ్బింగ్ కూడా శివాజీనే చెప్పాడు. దిల్ మూవీ కి డబ్బింగ్ చెప్పినందుకు శివాజీకి బెస్ట్ మెయిల్ డబ్బింగ్ అవార్డు కూడా దక్కింది. అలాగే మరో యంగ్ హీరో ఆర్యన్ రాజేష్ ఒకప్పుడు మంచి క్రేజ్‌తో హీరోగా ఉన్నాడు.
అయితే ఆర్యన్ రాజేష్ సొంతం సినిమాకు డబ్బింగ్ చెప్పింది శివాజీనే. ఈ సినిమా ఆర్యన్ రాజేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీలో నటించిన యంగ్ స్టార్ యష్‌సాగర్ కు కూడా శివాజీనే డబ్బింగ్ చెప్పారట. ఇక కోలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ సేతుపతికి తమిళ్ పిజ్జా మూవీ డబ్బింగ్ చెప్పింది కూడా శివాజీనే. ఇలా చాలామంది స్టార్ హీరోలకు శివాజీ అప్పట్లో డబ్బింగ్ చెప్పారట. ఆయన నటనకే కాక వాయిస్‌కి కూడా అప్పటిలో మంచి క్రేజ్ ఉండేది.