” ఆ ఓకే ఒక్క సినిమా వల్ల నా కెరీర్ సంక నాకిపోయింది “… ఎన్టీఆర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అంకిత మన అందరికీ సుపరిచితమే. రస్నా యాడ్ ద్వారా చాలా ఫేమస్ అయ్యి ” లాహిరి లాహిరి లాహిరిలో ” అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం అనేక సినిమాలు సైతం చేసి మెప్పించింది. 2016లో సడన్గా బిజినెస్ మ్యాన్ అయిన విశాల్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో సింహాద్రి మూవీలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన సిని కెరీర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ…” నా కెరీర్ దాదాపు అయిపోయింది అనే సమయంలో ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా పైనే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా హిట్ అయితే నా కెరీర్ ఇంకా ముందుకు సాగుతుందని ఆశతో ఉన్నాను. లేకపోతే నా పని అయిపోతుందని అప్పుడే అనుకున్నాను.

కానీ ఓ స్టార్ హీరో సినిమా కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ సినిమాలో నటించాను. చివరికి ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో నా కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే కచ్చితంగా సక్సెస్ ఉండాలి. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం . అలాగే ఇండస్ట్రీలో కొనసాగలేము కూడా ” అంటూ చెప్పుకొచ్చింది.