” నీకు ఇష్టం లేకపోతే దొబ్బెయ్ “… డైరెక్టర్ శంకర్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్న చరణ్ ఫ్యాన్స్….!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా చరణ్ శంకర్ దర్శకత్వంలో ” గేమ్ ఛేంజర్ “అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ , పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ శంకర్‌ను, నిర్మాత దిల్ రాజును ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దీంతో అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక ఈ దీపావళి పండక్కి సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి దాదాపు వారం అయిపోతున్న మళ్లీ ఎలాంటి సమాచారం లేదు. మరో రెండు రోజుల్లో పండగ ఉండడంతో అసలు పాట రిలీజ్ చేస్తారా? లేదా? అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ మాత్రం పాటకు సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదో ఇండియా వైడ్ నెగిటివిటీ తో ట్రెండ్ చేస్తామని డైరెక్టర్ ను, నిర్మాతను హెచ్చరించారు. అంతేకాదు..” ఇంట్రెస్ట్ లేకపోతే దొబ్బెయ్యండి. అంతేకానీ ఇలా చిన్న పిల్లల ఆటలు ఆడకండి. ఈ సినిమాపై ఇంట్రెస్ట్ లేకపోతే కమల్ హాసన్ తో ఇండియన్ 2,3,4,5 అంటూ వరుసగా సినిమాలు తీసుకోండి.. ఎవ్వరికి ప్రాబ్లం లేదు ” అని డైరెక్టర్ శంకర్ కు వార్నింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.