కోట్లాదిమంది రెబల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసిందోచ్… ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆపలేం రా బాబు..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సలార్‌ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో వాయిదాల తరువాత డిసెంబర్ 22న విడుదల కాబోతుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ట్రైలర్ విడుదల చేయమని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ” ట్రైలర్ అనౌన్స్మెంట్ తొందర లోనే ఉంది ” అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో విడుదల తేదీ ఏం మారకపోవడంతో.. ప్రేక్షకులు డిసెంబర్ 22 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను ఆపడం కష్టమే.