రీతు వర్మ.. మెగా హీరోతో ప్రేమ పై క్లారిటీ..!!

ఎన్నో సందర్భాలలో చాలామంది సెలబ్రిటీలు కలిసి కనిపించడం జరిగింది.అయితే ఇలాంటి వారు మొదట తామద్దరి మధ్య ప్రేమ ఉందా అని అడగగా.. తమ మధ్య ఏమీ లేదంటూ చివరికి వివాహం చేసుకున్న జంటలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీ, వరుణ్ తేజ్ లావణ్య, కాజల్ గౌతమ్ కిచ్లు తదితర సెలబ్రిటీలు సైతం ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో వైష్ణవి రీతు వర్మ జంట పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే వీరిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.

చాలా కాలంగా ఈ జంట గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం కొనసాగిస్తుందని ముఖ్యంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లిలో కూడా కనిపించడం జరిగిందట. పెళ్లికి ముందు అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీలో కూడా రీతు వర్మ చాలా ఆకర్షణీయంగా కనిపించడం జరిగింది. దీంతో పలువురు నెటిజన్స్ సైతం ఈ విషయాన్ని తెగ వైరల్ గా చేశారు. దీంతో రీతి వర్మ ఆ కుటుంబ హీరోలతో రిలేషన్స్ లో ఉందంటే వార్తలు వినిపించాయి.

తాజాగా ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవి తేజ్ ఈ విషయం పైన స్పందించారు.. వరుణ్ తేజ్ లావణ్య వివాహ వేడుకలలో రీతు వర్మ రావడానికి కారణం లావణ్య త్రిపాటికి రీతు వర్మ మంచి స్నేహితురాలని అందుకే పెళ్లి వేడుకలలో ఆమె కనిపించింది అని తెలిపారు. అంతకుమించి ఏమీ లేదని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ మామయ్యలు నటించిన ఖైదీ, బద్రి సినిమాలను రీమేక్ చేయాలనుకుంటున్నారని తెలియజేశారు. వైష్ణవ తేజ్ నటించిన ఆదికేశవ సినిమా ఈనెల 24న విడుదల కాబోతోంది ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది.