కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం ఫెమ్ కార్తీక..!!

అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కార్తీక నాయర్.. తన మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా ప్రశంసలు అందుకున్న ఈమె సీనియర్ హీరోయిన్ రాధా కూతురు. తెలుగు ఆడియన్స్ కి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి దూరమయ్యింది కార్తీక్ నాయర్.. ఇటీవల ఈ ముద్దుగుమ్మ వివాహ ప్రకటనను సైతం ప్రకటించిన విషయం తెలిసిందే నెలరోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లుగా తెలియజేసింది.

ఇప్పుడు తాజాగా తను చేసుకోబోయే వరుడు ఫోటోలను సైతం రివిల్ చేయడం జరిగింది. రోహిత్ మీనన్ అనే వ్యక్తిని ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు తన ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.వీరిద్దరి ఎంగేజ్మెంట్ సంబంధించి కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడం జరిగింది.. అయితే కార్తీక నాయర్ చేసుకోబోయే భర్త పేరు రోహిత్ గురించి ఎలాంటి సమాచారాన్ని తెలుపలేదు. “నిన్ను కలవడం విధి నిన్ను ఇష్టపడడం ఒక మ్యాజిక్ మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి సరైన సమయం ఇదే అనుకుంటున్నానంటూ” తన ఇంస్టాగ్రామ్ లో రాసుకుంది కార్తీక.

ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జోష్ సినిమా తర్వాత కార్తీక రంగం సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో నటించిన అల్లరి నరేష్ కు చెల్లెలుగా ఒక సినిమాలో నటించిన కార్తీకాకు అందం అభినయం సరైన బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో 2015 తర్వాత కార్తీకమారే సినిమాలో కూడా నటించలేదు.

 

View this post on Instagram

 

A post shared by Karthika Nair (@karthika_nair9)