మంచు లక్ష్మికి అలా ముద్దు పెట్టిన మెగా హీరో.. పిక్స్ వైరల్..

టాలీవుడ్‌లో మంచు డాటర్ లక్ష్మికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. తర్వాత ప‌లు షోల‌కు హోస్ట్‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన‌ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేస్తూ తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది. అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైన మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లకు విందు చేస్తూ ఉంటుంది. ఇక మెగా హీరో.. అల్లు శిరీష్ కూడా పలు సినిమాలో హీరోగా నటించిన‌ సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో వెకేషన్లు ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమైనా జరిగితే మాత్రం వీరిద్దరు సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల చిరంజీవి బాష్ పార్టి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దీవాలి ఈవెంట్లో రామ్ చరణ్ – ఉపాసన హోస్ట్ చేయ‌గా ఫంక్షన్ కి టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా పలువురు స్టార్ హీరోలు ఫ్యామిలీతో కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో దీవాలి సెలబ్రేషన్స్ లో మంచు వారసులు లక్ష్మీ, మనోజ్, అలాగే అల్లు వార‌సుడు అల్లు శిరీష్ కూడా హాజరయ్యారు.

ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి ఇటీవలే తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో మంచి లక్ష్మి స్టార్స్ అందరితో కలిసి సెల్ఫీలలో మెరిసింది. ఈ సెల్ఫీలో ఒక ఫోటో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఓ ఫోటోలో అల్లు శిరీష్ లక్ష్మీ బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో.. హాట్ ఫోటో షూట్ లు చాలవా తల్లి, మళ్ళీ ఇలా ముద్దులు పెట్టించుకుని ఆ పిక్స్ కూడా షేరు చేస్తున్నావా అంటూ.. నీకు ఇలాంటి ఫంక్షన్లకు ఇన్విటేషన్ ఇవ్వడమే తప్పు అంటూ.. నెగెటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మంచు లక్ష్మి పర్సనల్ విషయానికి వస్తే టీచర్ ఫ‌ర్‌ చేంజ్ అంటూ ఓ ట్రస్ట్ నడుపుతుంది. దీని ద్వారా పేద పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తుంది. అలాగే ఈ దీపావళికి పేద ప్రజలతో కలిసి ఈ ట్రస్ట్ ద్వారా సంతోషంగా గడిపింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా లక్ష్మీ షేర్ చేసింది. వ్యక్తిగతంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ మంచి లక్ష్మి చేసే ప్రతి పనిని తప్పుపడుతూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారే ఎక్కువగా ఉంటారు.