నాగచైతన్య ‘ దూత ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్ర‌భుతో నాగచైతన్య ఇటీవల నటించిన మూవీ కస్టడి. ఈ సినిమాతో చైతూ స‌క్స‌స్ అందుకోలేక‌పోయాడు. కాగా చైతన్య ప్రస్తుతం కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ త‌న ఖాతాలో వేసుకున్న చందు మండేటి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ఈ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండడంతో.. చైతన్య, సాయి పల్లవి కాంబోలో ఇదివరకే లవ్ స్టోరీ సినిమా వచ్చి భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఓవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి స‌క్స‌స్ అందుకోడానికి నాగచైతన్య సిద్ధమయ్యారు. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం దూత అనే వెబ్ సిరీస్‌ను నటించాడు చైతు. అక్కినేని హీరోలకు మనం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్.కే కుమార్ దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ షూటింగ్ అంతా పూర్తయి చాలా కాలమైనా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కారణంగా సిరీస్ రిలీజ్ కాకుండా డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫైనల్ గా దూత రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లు పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

చైతూ ఈ పోస్ట‌ర్లో చాలా డిఫరెంట్ గా కనిపించాడు. ఈ సిరీస్ లో నాగచైతన్య జర్నలిస్ట్ సాగర్ రోల్ ప్లే చేశాడు. ఇక నాగచైతన్య చేస్తున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో అభిమానుల్లో ఈ సిరీస్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మొత్తంగా 8 ఎపిసోడ్‌లుగా రానున్న దూత సిరీస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ఇక ఇందులో పార్వతి తిరువోతూ, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ కీలకపాత్రలో నటించారు. పలు సినిమాలతో ఫ్లాప్ అందుకున్న చైతు ఈ వెబ్ సిరీస్ తో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక దూత వెబ్ సిరీస్ తో చైతు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.