మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక – హాసిన్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏవి బయటకు రావడం లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
అయితే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అంటూ మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. అయితే ప్రోమో రాకముందే ఈ పాట బిట్ లీక్ అయింది. వెంటనే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మూవీ టీం కొంతసేపటి క్రితం మూవీ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈరోజు (నవంబర్ 7)న త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు మూవీ టీం. ఈ సాంగ్ మంచి దమ్ మసాల సాంగ్ అని ప్రోమోతోనే ఓ ఐడియా వచ్చింది.
ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ కావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మహేష్ మాస్ జాతర షురూ అంటూ.. మాస్ కొట్టుడు అదిరిపోయింది అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.