వరుణ్, లావణ్య ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలు ఇటలీలో ఇప్పటికే హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో లావణ్య, వరుణ్ పసుపు బట్టల్లో కన్నులు విందు చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే వరుణ్ తనకి కాబోయే భార్యను రొమాంటిక్ గా హగ్ చేసుకున్న పిక్స్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి.
అలాగే నాగబాబు సైతం తన భార్యతో కలిసి అదిరిపోయేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా జాయిన్ అయింది. వీరందరిలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. స్టైలిష్ గా 20 ఏళ్ల పిల్లాడిలా.. అందరినీ ఆకట్టుకున్నాడు. స్వాగ్ తో కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా… మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఇక (నవంబర్1) ఈరోజు మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్, లావణ్యాలు గ్రాండ్ గా ఒకటి కాబోతున్నారు.
అలాగే సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్లో అంగరంగ వైభోగంగా పెళ్లి రిసెప్షన్ జరుపుకోబోతున్నారు. ఈ రిసెప్షన్ కి సినిమా ప్రముఖులతోపాటు రాజకీయ వ్యాపారులు కూడా హాజరవ్వనున్నారు. ఇక ఈ ఫోటోలో మెగాస్టార్ లుక్ ని చూసిన చిరు అభిమానులు…” ఆయన అందం ముందు ..ఈ తరం హీరోలు సరిపోరు. ఆ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఒక్క చిరుకు మాత్రమే సొంతం. చిరు… చరణ్ కు నాన్న లాగా లేడు.. తమ్ముడు లాగా ఉన్నాడు. ఏదైతేనే బాస్ ఇస్ బ్యాక్ ” అంటూ ఓ రేంజ్ లో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.