చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే నేచురల్ ఫేస్ మాస్క్.. సులభంగా తయారు చేసుకోండి ఇలా..

ఇటీవల కాలంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు జెండర్ తో సంబంధం లేకుండా అందరూ చర్మ సౌందర్యం గురించి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది కాస్మెటిక్స్ తో తమ సౌందర్యాన్ని పెంచుకుంటుంటే మరి కొంతమంది నేచురల్ టిప్స్ ద్వారా తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కాస్మెటిక్స్ ద్వారా వచ్చే సౌందర్యం ఎక్కువ సేపు నిలవదన్న సంగతి అందరికీ తెలుసు. ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే మొహంలో గ్లో అనేది పోతుంది. అయితే దాని గురించి బాధపడాల్సిన పనిలేదు. ఈ నేచురల్ టిప్స్ తో ఇంట్లోనే ఓ పవర్ఫుల్ ఫేషియల్ తయారు చేసి వేసుకోవడం వల్ల మీ స్కిన్ వైట్ గా, బ్రైట్ గా కనిపిస్తుంది.

చర్మంలో ఉండే డెత్ సెల్స్ నశించి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. దీనికోసం ముందుగా ఓ బౌల్లో వన్ టేబుల్ స్పూన్ బియ్యప్పిండి, ఒక్క టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ పెరుగును తీసుకొని బాగా కలపాలి. దీనికి సరిపడా బియ్యం కడిగిన నీళ్లను పోసి ఫేషియల్ మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి వేసుకొని పూర్తిగా డ్రై అయ్యేంతవరకు ఆరబెట్టాలి. కావాలంటే మిశ్రమాన్ని చేతులకు కూడా వాడవచ్చు. ఇది డ్రై అయిన తరువాత తడివేళ్లతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి.

ఈ మాస్క్ టాన్ రిమూవ్ చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మురికి తొలగించి క్షణంలో స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఇన్‌స్టెంట్ గ్లోయింగ్ కోసం ఈ రెండు తప్పక పాటించండి. ఈ మిశ్రమంలో పెరుగును ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. కనుక ఎప్పుడైనా స్పెషల్ ఈవెంట్స్ లేదా ఫంక్షన్ కు వెళ్లాలన్న‌, బయటకు వెళ్లాలన్న ఈ సింపుల్ ఫేస్ మాస్క్ వేసుకోండి. తర్వాత స్కిన్ వాష్ చేసుకుంటే ఫేస్ లో గ్లో మీకే తెలుస్తుంది.