అందరూ ఇష్టంగా తినే చెర్రీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే ఫ్రూట్స్‌లో చెర్రీ ఒకటి, చెర్రీస్ వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. చెర్రీస్ లో విటమిన్, పొటాషియం, ఖనిజాలు లాంటి ఎన్నో ప్రోటీన్లు ఉంటాయి. చెర్రీస్ లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. చెర్రీలో ప్రయోజనకరమైన ఎలాజాక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ మెరుగైన అభిజ్ఞ పనితీరులో సహాయపడుతుంది. అలాగే చెర్రీస్ లో ఉండే మెలటోనిన్ మంచి నిద్ర అందిస్తుంది. రుచిలోనే కాదు అవసరమైన పోషకాలను కూడా ఇది సమృద్ధిగా అందిస్తుంది.

చెర్రీలో ఉండే ఫైబర్ జీర్ణ‌క్రియ మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాలను తగ్గిస్తుంది. చెర్రీ లో ఉండే పాలి ఫినల్ వల్ల ఈ ఆరోగ్య సమస్యల నుంచి మనని మనం కాపాడుకోవచ్చు. చెర్రీ పండ్లను తరచుగా తింటే శరీరంలో కొవ్వు తగ్గడమే కాదు.. శరీరంలో అధికంగా ఉన్న మెగ్నీషియం, సోడియంను తగ్గిస్తుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. క్యాన్సర్ కణాలను చెర్రీ నిరోధిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

చెర్రీస్‌లో ఫినోలిక్ యాసిడ్స్ ఉంటాయి. అంథోసైనిన్‌ అధికంగా ఉండి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం హెచ్డిఎల్ కొల‌స్ట్రాల్‌ను పెంచి గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అరికట్టడానికి చెర్రీస్ ఉపయోగపడతాయట. క్ర‌మం తప్పకుండా చెర్రీ తిన్న‌టంవ‌ల్ల ప్రిరాడికల్స్ తగ్గిస్తాయి. రోజు వ్యాయామం చేసేవారు శ్రమ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కండరాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటివారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వాటిలో చెర్రీ కూడా ఒకటి. చెర్రీ పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. కండరాల నొప్పులు, వాపులు వంటివి కూడా తగ్గుతాయి.