నందమూరి బాలకృష్ణ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా అఖండ ఈ సినిమా విడుదలైన ప్రతి చోట కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. బాలయ్య ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించారు ఇందులో ముఖ్యమైన పాత్ర అఘోర పాత్ర అని చెప్పవచ్చు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలకు మించి అఖండ భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో శివ భక్తుడిగా బాలయ్య అద్భుతంగా నటించారు..అఘోర పాత్రలో కూడా ఇరగదీసేసారని చెప్పవచ్చు. ఇప్పుడు బాలయ్య బాటలోనే చిరంజీవి కూడా ఒక సినిమాలోగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు .చిరంజీవి చేయని పాత్ర అంటూ ఏదైనా ఉందా అంటే లేదని చెప్పవచ్చు.. పునాదిరాళ్లు సినిమాతో మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ఉన్నారు. గతంలో కూడా శ్రీమంజునాథం చిత్రంలో కూడా శివుని పాత్రలో మెప్పించారు. అదే చిత్రంలో పలు రకాల గెటప్లలో కూడా కనిపించారు. అందులో అఘోరా గెటప్ కూడా ఒకటి .ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ చిరంజీవి కూడా బింబీసార డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా ఇలాంటి ఒక చిన్న పాత్ర ఉండబోతుందని టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లోనే చిరంజీవి అఘోర పాత్రలో మెప్పించిన మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి మరి. ఇటీవల కాలంలో బాలయ్య అఖండ సినిమాలో మెప్పించారు ..మరి చిరంజీవి మెప్పిస్తారో లేదో చూడాలి మరి.