మొద‌లైన వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు.. వైర‌ల్ గా మారిన కాక్‌ టైల్ పార్టీ ఫోటోలు!

మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. న‌వంబ‌ర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి వివాహం జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాల‌తో పాటు లావ‌ణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ఇట‌లీ చేరుకున్నారు.

వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో వ‌ధూవ‌రులు డిజైన‌ర్ దుస్తుల్లో మెరిసిపోయారు. అలాగే అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు ఈ కాక్ టైల్ పార్టీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి.

ఇక నేడు హ‌ల్దీ మ‌రియు మెహందీ వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఇరుకుటుంబ స‌భ్యులు ఈ వేడుక‌ల‌కు రెడీ అవుతున్నారు. రేపు పెళ్లి వేడుక పూర్తైన త‌ర్వాత అంద‌రూ హైద‌రాబాద్ కు రానున్నారు. న‌వంబ‌ర్ 5న హైదరాబాద్‍లో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరగనుంది. ఈ రిసెప్ష‌న్ కు టాలీవుడ్ మొత్తం క‌దిలిరానుంద‌ని తెలుస్తోంది.