జూనియర్ ఎన్టీఆర్ గురించి కళ్ళు జిగేల్‌మ‌నే ఈ విషయాలు మీకు తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో భారతీయ సినిమాను సెంటర్ స్టేజ్‌కి తీసుకు వచ్చాడు. ఇక ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో 30కి పైగా సినిమాల్లో నటించగా ఆయన నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్‌గా నిలిచాయి. ఇక తన అభిమానులు ముద్దుగా మాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎన్టీఆర్ ను పిలుస్తూ ఉంటారు.

పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులను సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. త‌న‌ ఇల్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కుటుంబంతో ఎంత జాలీగా గడుపుతారో షూటింగ్ సమయంలో ఖాళీ దొరికితే సెట్స్ లో వారితో కూడా అంతే జాలీగా గడుపుతూ నిరాడంబరంగా ఉంటాడు. ఇక ప్రస్తుతం అలాంటి నిరాడంబర జీవితం గడిపే ఎన్టీఆర్ హౌస్ లోపలి ప్రాంతాలన్నీ ఓ లుక్ వేద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ హౌస్ లొకేషన్ :
హైదరాబాదులోనే అత్యంత పాష్ ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు ఉంది. ఈ ఏరియాలోనే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోల ఇల్లు కూడా ఉన్నాయి. ఇక వీరు చాలామంది జూనియర్ ఎన్టీఆర్కి మంచి స్నేహితులు. ఈ ప్రాంతంలో నివసించే అత్యంత ఫలమైన నటులలో మహేష్ బాబు, రామ్ చరణ్, రానా దగ్గుపాటి కూడా ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ హౌస్ కాస్ట్ :


ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నివసిస్తున్న విలాసవంతమైన భవనం రూ.25 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఇంటి చుట్టూ విశాలమైన పచ్చిక బయిళ‌తో ఆరాధకరమైన వాతావరణ ఉంటుంది. హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి తో పాటు బెంగళూరు, కర్ణాటకలో కూడా పలు ఆస్తులను కూడా పెట్టాడు.

ఈ పై కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ లో బ్యాక్ గ్రౌండ్ లివింగ్ రూమ్ ఎంతో అద్భుతంగా డెకరేట్ చేయబడింది.

ఇక ఈ పై ఫోటోలో పెద్ద ఎల్లో సోఫా కుర్చీలను చూడవచ్చు. ఇది ఎన్టీఆర్ హౌస్ లోని ఓ అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు, చిన్న కొడుకులను ఫోటోలో బంధిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకులకు కలిసి ట్వినింగ్‌ వస్త్రాలు ధరించి ఫోటో దిగిన ఈ ప్లేస్ ఇంటి విశాలమైన బాల్కనీ. ఇంటి చుట్టూ చెట్లు మరియు గడ్డి రూపంలో పచ్చని ఆకులు ఉన్నాయి.

ఈ పై వీడియోలో కనిపించేది జూనియర్ ఎన్టీఆర్ హౌస్ గ్రాండ్ ఎంట్రీ.

ఇక ఈ పై వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుతో కలిసి మోడరన్ కిచెన్ లో సందడి చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి లష్ గార్డెన్స్ తో సతీమణితో కలిసి దిగిన ఫోటో.

ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ తన గార్డెన్ ఏరియాలో కొడుకుతో కలిసి క్రేజీ స్టీల్ ఇచ్చి సెల్ఫీ దిగారు.