తలస్నానం చేసే ముందు ఈ ఒక్కటి చేయండి చాలు ..జుట్టు ఊడమన్నా ఊడదు ..ప్రామిస్ నమ్మండి..!

చాలామందికి అనేక కారణాలవల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలుతూ ఉంటే మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతారు. వీటి కోసం ఖరీదైన షాంపూలను, హెయిర్ క్రీమ్ లను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం దొరకదు. జుట్టు రాలిపోవడం కేవలం అమ్మాయి సమస్య కాదు.. మగవారికి కూడా జుట్టు ఊడిపోవడం వల్ల అంద వికారంగా కనిపిస్తుంటారు.

ప్రస్తుత జనరేషన్లో ఫోన్లు ఎక్కువ వాడడం, స్ట్రెస్ వల్ల ఈ సమస్యకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హెడ్ బాత్ చేసే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే హెయిర్ ని చాలా అందంగా మార్చుకోవచ్చు. తల స్నానం చేయడానికి ముందు కచ్చితంగా నూనె రాయాలి. ఎందుకంటే నూనె రాయడం వల్ల జుట్టు తేమగా ఉంటుంది. అందువల్ల జుట్టు పొడిబారిపోదు.

అలాగే తల స్నానం చేసే ముందు షాంపూని నేరుగా తలపై పెట్టకుండా.. గోరువెచ్చని నీటితో లేదా చల్లని నీటితో కలిపి హెడ్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గడంతో పాటు షైనీగా కూడా ఉంటుంది. అనంతరం తలకు షాంపూ నురగ పూర్తిగా పోయేంతవరకు శుభ్రం చేయాలి. అలా చెయ్యకపోతే జుట్టు రాలిపోయి పొడిబారిపోతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే పొడవైన, వత్తయిన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.