ఆధార్ కార్డుతో ఇలా చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతా ఖాళి..!!

ప్రస్తుతం ఉన్న కాలంలో టెక్నాలజీ పూర్తిగా పెరిగిపోయిన కారణం చేత చాలామంది ఎక్కువగా స్కాములు హ్యాకింగ్ బారిన పడుతూ ఉన్నారు.. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం లోని ఈ లోసుగులను ఉపయోగించి బ్యాంకు ఖాతాలను సైతం జీరో చేయొచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ లో మన యొక్క వేలి ముద్రలను ఆధార్ నెంబర్ మరియు బ్యాంకు డీటెయిల్స్ లను యాక్సెప్ట్ చేసి.. బ్యాంకులో ఉండే నగదును మొత్తం దొంగలించవచ్చు.. ముఖ్యంగా ఈ స్కామ్ చేసే వారికి ఓటిపి కూడా అవసరం ఉండదట.


అసలు మీ ఖాతా నుండి మీ డబ్బు డెబిట్ చేయబడిందని మీకు నోటిఫికేషన్ కూడా అందదని సైబర్ కేఫ్ , ఫోటో కాఫీ, హోటల్స్ మొదలైనవి ఆధార్ నెంబర్లు సైతం ఇలాంటి వాటిలో దొరికేటువంటి ఆధార్ కార్డు నెంబర్లు ఇతరత్రా వాటిని ఉపయోగించి ఈ స్కాములు చేస్తున్నట్లు పలువురు టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు హోల్డర్ వేలిముద్రలను యాక్సెప్ట్ చేయడానికి చాలామంది వారి యొక్క లాండ్ రిజిస్ట్రేషన్ ఇంకా ఇతర వనరులను సైతం తీసుకొని వారి యొక్క వేలిముద్రను కృత్రిమ సిలికాస్ బోటనవేలను ముద్రిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని ద్వారానే డబ్బులు కొట్టేస్తున్నారట.

అయితే ఇలాంటి స్కాముల నుంచి సురక్షితంగా ఉండాలి అంటే తప్పనిసరిగా..maadhaar యాప్ లేదా..uidai అనే వెబ్సైట్లో మన ఆధార్ యొక్క బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవడం మంచిది..aepsనీ నిలిపివేయడానికి ఆధార్ యొక్క బయోమెట్రిక్ డేటాను సైతం బ్లాక్ చేయడానికి ఈ యాప్లను ఉపయోగిస్తారు.. మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఈ యాప్ ను ఉపయోగించి బయోమెట్రిక్ ను అన్లాక్ చేసుకోవచ్చు.. ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే గూగుల్ ప్లే స్టోర్ ని ఉపయోగించి maadhaar యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవచ్చు..ఐఫోన్ యూజర్స్ అయితే యాప్ స్టోర్ ని ఉపయోగించి maadhaar యాప్ కు అవసరమైన పర్మిషన్ ని ఇవ్వాల్సి ఉంటుంది.. పాస్వర్డ్ అయితే కచ్చితంగా నాలుగు అంకెల నెంబర్ ని పెట్టుకోవాలి.