మనకు ఎలాంటి వాతావరణం లోనైనా సరే దొరికేటువంటి కాయగూరలలో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగిని ఎలా తిన్నా కూడా ఉపయోగకరంగా ఉంటుంది.. ముల్లంగి వల్ల ఉపయోగాలను ఒకసారి తెలుసుకున్నట్లయితే.. ముల్లంగి ఒక గొప్ప మూలకం అని కూడా చెప్పవచ్చు.. ముల్లంగిలో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా లభిస్తుంది. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ప్రస్తుతం మారుతున్న చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఆహారంలో ముల్లంగిని జత చేయడం మంచిది. ఇందులో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, పోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.
అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు గుండెపోటుకు చాలా ప్రమాదకరము.. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్న వారు ముల్లంగిని తినడం మంచిది..ఇందులో పొటాషియం తగిన పరిమాణంలో ఉండడం వల్ల హై బీపీని తక్షణమే తగ్గిస్తుంది.
ముల్లంగి జ్యూస్ తాగడం వల్ల మా చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మెరుస్తూ కనిపిస్తుందట. ఇందులో విటమిన్ సి ,పాస్పరస్ ,జింక్ వంటివి చాలా పోషకాలు లభిస్తాయి ఇవి చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొటిమలతో ఇబ్బంది పడేవారు వీటిని తినడం మంచిది.
మొలలతో ఇబ్బంది పడేవారు ముల్లంగిని తరచూ తింటూ ఉండడం వల్ల అలాంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ కూరగాయలను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట.
జలుబు దగ్గు ఇతర అంటూ వ్యాధులనుంచి దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ముల్లంగిని తింటూ ఉండాలి ఇందులో విటమిన్ సి వల్ల ఎలాంటి లోపాన్ని కూడా దరి చేరనివ్వదు.