ఆడపిల్ల అనే సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి పలు సీరియల్స్ లో నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ప్రత్యేకంగా కొన్ని షోలు కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రముఖ సీనియర్ నటి సనా కొడుకును వివాహం చేసుకున్న సమీరా .. ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఫోటోని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన పెదవికి రక్తం కారుతున్న ఫోటోని షేర్ చేస్తూ ఒక లాంగ్ నోట్ రాసుకొచ్చింది. సమీరా ఆ ఫోటోని షేర్ చేయగానే నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తుండగా ఆమె ఇలా రాసుకుంటూ.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ప్రతి ఒక్కరి కథకు ఒక అవగాహన ఉంటుంది. జ్ఞాపకశక్తి కోసం క్లిక్ చేసిన ఫోటో నా ఫీడ్ లో చేరుతుందని అనుకోలేదు అయితే నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది చూస్తే ఎవరైనా నేను నా భర్తతో గొడవ పడినట్లు కనిపిస్తుంది.
వాస్తవానికి వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ నా భర్తతో నేను చాలా మంచి సమయాన్ని గడిపాను. నేను అన్వర్ జాన్ ను వివాహం చేసుకోక ముందు కూడా నా శరీరంపై గాయాలు ఉండేవి. అవి నిజానికి నా మేనల్లుడు అయాన్ చేసినవి . అన్వర్ జాన్ తన మేనల్లుడు ప్రిన్స్ వల్ల గాయాలు అయ్యేవి. కానీ నేను నా భర్తతో గొడవ పడినట్టుగా ఈ పిక్ లో కనిపిస్తోంది. అయితే ఇది అర్హాన్ పొరపాటుతో జరిగింది.. మేము కూడా చాలా గొడవపడతాము కానీ విపరీతంగా ప్రేమించుకుంటాము అంటూ రాసుకొచ్చింది సమీరా.సమీరా పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు సీనియర్ నటి సన కుమారుడినే..
View this post on Instagram