కథ ఒక్కటే కానీ హిట్లు రెండు….ఆ సినిమాలేమిటో తెలుసా?

ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. ఈ చిత్రాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటే, మరి కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైపోతూ ఉంటాయి.మనం గమనిస్తే కొన్ని సార్లు మనం చూసిన సినిమా నచినప్పటికీ, ఇదే కథ ఇంకేదో సినిమాలో చూసానే అన్న అనుభూతి కలుగుతుంది. ఇలా మన టాలీవుడ్లో చాలా సార్లు జరిగింది. ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు రెండు సినిమాలు చేసి, రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించిన సంఘటనలు చాలానే ఉన్నాయ్.

ఈ మధ్య కూడా అచ్చం ఇలానే జరిగింది. మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నతురల్ స్టార్ నాని ఒకే కథ తో వచ్చి ప్రేక్షకులను మెప్పించారు. ఆ సినిమాలు మరేవో కాదండి. నాని హీరోగా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన “దసరా” మరియు చాలా ఏళ్ళ క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన “ఆర్య 2”. ఒకటి పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. మరొకటి క్లాసిక్ లవ్ స్టోరీ. మరి ఈ రేండు ఒకేలా ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? తీసిన విధానం వేరైనా…కథ మాత్రం ఒక్కటే.

దసరా సినిమాలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నానిని 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. మరి ఆర్య 2 చిత్రం 2009 లో విడుదలయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఐతే ఈ రెండు సినిమాల కాన్సెప్ట్ ఒక్కటే. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉంటారు. ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడతారు. కానీ స్నేహం కోసం ప్రేమించిన అమ్మాయిని త్యాగం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు హీరో. కానీ చివరికి హీరోయిన్, హీరో ఒకటవుతారు. ఇలా ఒకే లైన్ తో చిన్న చిన్న మార్పులు చేసి రెండు సినిమాలు తీసేసారు.