రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?

సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి గారు, ఆ తరువాత రవి తేజ, ఇప్పుడు నాని. వీళ్ళ తరువాత ఇప్పుడిప్పుడే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీ లో కాస్త నిలకడ చూపుతున్నాడు మరో కుర్ర హీరో. అతడే కిరణ్ అబ్బవరం.

“రాజా వారు రాణి గారు” చిత్రం తో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం, హిట్లు ప్లాపుల తో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రాజా వారు రాణి గారు చిత్రం తరువాత కిరణ్ నటించిన చిత్రాలేవీ ఊహించిన స్థాయి విజయాలను సాధించలేదు. “ఎస్ ఆర్ కల్యాణమండపం” కాస్త పర్వాలేదనిపించింది ఆ తరువాత అతను చేసిన సమ్మతమే, నేను మీకు బాగా కావలసినవాడిని, మీటర్ చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కిరణ్ అబ్బవరం హీరోగా, నేహా శెట్టి హీరోయిన్ గా, రథినాం కృష్ణ దర్శకత్వంలో వస్తున్నా చిత్రం “రూల్స్ రంజన్”. రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటివారంలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు మేకర్స్. కానీ సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సిన ప్రభాస్ “సాలార్” చిత్రం వాయిదా పడటంతో, రూల్స్ రంజన్ ఈ డేట్ ను లాక్ చేసాడు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని కూడా విడుదల చేసింది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఒక వైపు పక్క హిట్ అని ప్రోత్సహిస్తూనే మరో వైపు ఇంత తొందర మంచిది కాదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మరి ఈ చిత్రమైన కిరణ్ అబ్బవరంకి హిట్ తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే!