షారుఖ్ కు తల్లిగా నటించడం నాకు ఇష్టం లేదు.. కారణం ఇదే..!!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ రిధి డోగ్రా ‘ జవాన్ ‘ లో స్టార్ హీరో షారుక్ కు తల్లిగా నటించిన అనుభవాలను షేర్ చేసుకుంది. అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల విడుదల అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది. అయితే ఇందులో షారుఖ్ అమ్మ ‘ కావేరి ‘ పాత్ర పోషించిన నటి మాట్లాడుతూ 38 ఏళ్ళు వయసులోనే షారుఖ్ తల్లిగా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపలేదని.. కానీ అట్లీ తనను కన్విన్స్ చేశాడని తెలిపింది.

2022లోనే అట్లీ టీమ్ కాల్ చేసి నన్ను అర్జంట్ గా కలవమంటున్నాడని చెప్పారు. పాత్ర గురించి చెప్పగానే నో చెప్పా.. ఎందుకంటే షారుఖ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అమ్మ క్యారెక్టర్ చేయాలనిపించలేదు. కానీ అట్లీ నా బ్రెయిన్ వాష్ చేశాడు. దీంతో మదర్ రోల్ సవాలుగా స్వీకరించి ఒప్పేసుకున్నా.. నా వరకైతే అది పెద్ద రిస్క్.

 

ఇప్పుడు అభిమానుల ఆదరణ చూసి నేను సరైన నిర్ణయమే తీసుకున్నా అనిపించింది. అట్లీ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంది. నిజంగా అతను స్వీట్ పర్సన్ ‘ అని పొగిడేసింది. చివరగా షారుఖ్ మళ్లీ తనతో నటించాలని ఉందని చెప్పడం గొప్పగా అనిపించిందన్న నటి తన కెరీర్‌లో ఇదే అతిపెద్ద ప్రశంసగా పేర్కొంది.