కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యష్ నటించిన కే జి ఎఫ్ సిరీస్ రెండు సినిమాలు… ఒక్కదానిని మించేలా మరోటి అంతటి అద్భుతం సృష్టించాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ మూవీస్‌ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించగా.. ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు.
అయితే కెజిఎఫ్ 2 భారీ విజయం తరువాత యష్ ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై ఎప్పటి నుండో.. యష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ఇక లేటెస్ట్ శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.
భారీ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టార్ డ్రామా మూవీగా ఇది తెరకెక్కనుండగా… ఇందులో మలయాళ నటుడు టోవినో థామస్ నెగటివ్ రోల్ చేయనున్నట్లు టాక్. ఈ మూవీ డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు అతి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ కానుంది.