పవన్ కళ్యాణ్ ఆస్తులు, అప్పులు వివరాలు చెప్పిన మెగా బ్రదర్ నాగబాబు..!

టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్. కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా కోట్లు కూడబెట్టే అవకాశం ఉన్నా సినిమాలను పక్కనపెట్టి మరి రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆస్తులను మరింత పెంచుకున్నాడా..? లేదా అప్పులను పెంచుకున్నాడా..? పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడు అనే అంశంపై నాగబాబు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం నాగబాబు చేసిన ఆ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఓ ఇంటర్వ్యూకి హీజ‌రు కాగా పవన్ కళ్యాణ్ పిల్లల పేరు మీద ఉన్న ఫ్రిక్స్డ్‌ డిపాజిట్ మనీని కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టాడా..? అనే ప్రశ్న ఎదురయింది. దానికి నాగబాబు స్పందిస్తూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జీవితం లోన్‌తో కూడిన లగ్జరీ లైఫ్ లాంటిది. తన దగ్గర ఉన్న కార్ దగ్గర నుంచి త‌ను ఉంటున ఇంటి వరకు అన్ని లోన్‌ల‌ మీద ఉన్నవే అంటూ చెప్పుకొచ్చాడు.

తన జీవితంలో తనకంటూ క‌ళ్యాణ్ ఏమి సంపాదించుకోలేదని.. ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్లలో కళ్యాణ్ బాబు ఒకడైనా.. తనకు ఉన్న ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. స‌వ‌న్ పార్టీ పెట్టిన సమయంలో డబ్బులు లేక పిల్లల ఫిక్స్ డిపాజిట్లు మనీని కూడా వాడేసాడని.. తనకు మిగిలేలా ఆస్తి ఏదైనా ఉందంటే అది తన ప్రేమతో కొనుక్కున్న శంకరపల్లి ఫామ్ ల్యాండ్‌ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ కి ఫార్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టమట.. ఎప్పుడో తన కెరీర్ బిగినింగ్‌లో సినిమా ద్వారా వచ్చిన మొదటి రూ.8 లక్షల డబ్బుతో ఎంతో ఇష్టంగా ఆ ఫార్మా ల్యండ్‌ని తీసుకున్నాడని.. అయితే అది కూడా ఒక సమయంలో అమ్మేబోయాడని.. నాగబాబు వివరించాడు. దానికి నేనే అడ్డుపడ్డాను.
జానీ మూవీ టైం లో ఈ సినిమా ఫ్లాప్ అవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన ఆస్తులన్నీ డిస్ట్రిబ్యూటర్స్ కు ఇచ్చేసాడని.. ఈ 8 ఎకరాలు కూడా తను అమ్మ‌బోతుంటే నేనే అడ్డుకున్నానని వివ‌రించాడు.

ఇది నువ్వు స్వార్థం కోసం డబ్బులు సంపాదించడానికి తీసుకున్నది కాదు.. వ్యవసాయంపై నీకు ఆసక్తితో ఈ స్థలాన్ని తీసుకున్నావ్ దీని అమ్మడం కరెక్ట్ కాదు అంటూ చెప్పానని.. పవన్ కళ్యాణ్ అది అమ్మకుండా ఉంచాడు. ప్రస్తుతం తనకి ఉన్న ఏకైక ఆస్తి ఆ శంకరపల్లిలో ఉన్న ఫార్మా ల్యాండ్‌ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం పార్టీ కార్యక్రమాలకు, సహాయాలకు పవన్ కళ్యాణ్ చాలా ఖర్చు చేశాడని.. హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకునే ఆయన ఎంత సంపాదించినా కేవలం రూ.150 నుంచి రూ.200 కోట్ల లోపే ఆస్తులు కూడపెట్టాడని పార్టీ పెట్టిన తర్వాత తన సొంత ఆస్తులను కూడా ఆ పార్టీ కోసం దార పోశాడని తెలుస్తుంది.