కవల పిల్లల క్యూట్ పిక్స్ షేర్ చేసిన నయనతార…

లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార గురు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అలానే దర్శకుడు విగ్నేష్ శివన్ కూడా మనందరికీ సూపరిచితుడే. ఇక విగ్నేష్ శివన్, నయనతార పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా కవల పిల్లలకి తల్లితండ్రులు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ కవలలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ , ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ అని నామకరణం చేసారు. ఈరోజు నయన్, విగ్నేష్ పిల్లల మొదటి పుట్టినరోజు కావడం తో సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది నయనతార. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ చూసిన అభిమానులు చిన్నారులీద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలానే ఆ ఫొటోస్ చూసిన కొందరు ‘క్యూట్ ఫ్యామిలీ ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నయనతార, విగ్నేష్ సుమారు ఎడేళ్లు ప్రేమలో ఉన్నారు. ఆ తరువాత పెద్దవాళ్ల అంగీకారంతో జూన్ 9 న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ జంట మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి అయిన నాలుగు నెలలకే సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకి తల్లితండ్రులు అయ్యారు. ప్రస్తుతం తమ ఇద్దరు పిల్లలతో నాయనతార, విగ్నేష్ హ్యాపీ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.