బిగ్‌బాస్‌ 7లో ఆ కంటిస్టెంట్‌కు పెరుగుతోన్న ఫాలోయింగ్‌… సీన్ రివ‌ర్స్ ఇదే..!

మన తెలుగు బుల్లితెరపై ఎంతో సక్సెస్ అయిన గ్రాండ్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ షో ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఏడవ సీజన్లోకి వచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. గడిచిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ చాలా బెటర్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది.

ఈ సీజన్లో చాలావరకు తెలుగు వాళ్లే కాకుండా ఇతర నటీనటులు కూడా కనిపించారు. అయితే ఇంట్రెస్టింగ్ గా ఈసారి షోలో నాన్ లోకల్ యంగ్ స్టార్ కి మన ఆడియన్స్ అపారమైన ఆదరణ అందిస్తున్నారు. మరి అతను ఎవరో కాదు యావర్. తను పలు సీరియల్స్ లో కనిపించి బుల్లితెర‌పై పాపుల‌ర్ అయ్యాక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

తనకు తెలుగు కూడా అంతగా రాకపోయినా కూడా చాలా సార్లు డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యాడు. ఈ క్రమంలోని తమ గేమ్ కి తెలుగు ఆడియన్స్ మంచి పాజిటివ్గా ఉన్నారని చెప్పవచ్చు. మరి ఈ కంటిస్టెంట్ ఎప్పటి వరకు కొనసాగుతాడో చూడాల్సి ఉంది.