బాలీవుడ్ లో ఎంతోమంది నటీమణులు సైతం మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించిన వారు ఉన్నారు. చాలామంది కూడా తమ కెరియర్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీని విడిచి వెళ్లడం జరిగింది. బాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేర్కొంది అనుహ్యంగా కనుమరుగైన హీరోయిన్ అమృత రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చిన్న వయసులోనే నటనను విడిచిపెట్టి వివాహం చేసుకుంది. తెలుగులో మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో కూడా నటించింది.
2002లో అప్ కె బరాస్ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి అవార్డు అందుకున్న అమృతరావు 2007 లో తెలుగులో అతిధి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా నటించింది. స్టార్ హీరోల సరసన బాలీవుడ్లో నటించిన తర్వాత 2016 మే 15న రేడియో జాకి అన్మోల్ సూద్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృత రావు ప్రస్తుతం కుటుంబంతో చాలా ఆనందంగా తన సమయాన్ని గడిపేస్తోంది.
అమృత రావు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఇమే ముంబైలో కనోస్సా గర్ల్స్ స్కూల్లో చదువుకుంది. అమృత రావు సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేయడానికి ముంబైలో ఒక కాలేజీకి వెళ్లిందట.. మోడలింగ్ ఆఫర్లు రావడంతో అమృత రావు డిగ్రీని పూర్తి చేయలేదట. ఆ తర్వాత కెరియర్ పెళ్లి ఇలా ఒకేసారి జరగడంతో పెళ్లి తర్వాత ఆమె సినిమాలను నటించకూడదని నిర్ణయాణి తీసుకుందట. అందుకే తనకు అవకాశాలు వచ్చినా కూడా నటించలేదని తెలుస్తోంది. ఇక ఈమె చెల్లెలు ప్రీతికా రావు కూడా పరిశ్రమలో రాణిస్తోంది.