షారుక్ ఖాన్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ఈ ఏడాది పఠాన్ సినిమాతో మరొకసారి తన హవా కొనసాగించారు. ఇటీవలే విడుదలైన జవాన్ సినిమాతో మరొక ప్రభంజనాన్ని సృష్టించారు షారుఖ్ ఖాన్. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులారిటీ సంపాదించారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన షారుక్ ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయారు.

 

ఇండియాలోనే అత్యంత సంపన్నులలో ఒకరిగా పేరు సంపాదించారు దాదాపుగా రూ .6000 కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్న షారుక్ ఇటీవలే జవాన్ సక్సెస్ తో మరింత ఖుషిగా ఉన్నారు. ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో జవాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ప్రెస్ మీట్ లో షారుక్ ఖాన్ చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా షారుక్ ధరించిన పటేల్ ఫిలిప్ వాచ్ స్పెషల్గా అందరిని ఆకట్టుకుంటోంది. ఆ వాచ్ ధర దాదాపుగా రూ.1.22 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయం తెలిసి పలువురు నెటిజెన్లు అవాక్కవుతున్నారు.

అయితే షారుక్ ఖాన్ దగ్గర ఇలాంటి వాచ్ కలెక్షన్స్ చాలానే ఉన్నాయి. దాదాపుగా 6 వాచ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ డిసెంబర్లో రాజ్కుమార్ ఇరానీ దర్శకత్వంలో వస్తున్న డుంకి చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అలాగే సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్-3 లో అతిధి పాత్రను నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు షారుక్ ఖాన్ అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత షారుఖ్ ఎవరితో సినిమా చేస్తారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.