ఆమె సాయం ఎప్పటికీ మరువలేనిది – కృష్ణవంశీ..!!

తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో వ్యాంప్ పాత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించింది సిల్క్ స్మిత. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా కొనసాగిన కృష్ణవంశీ కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1980లో సినీ ఇండస్ట్రీలోకి రావాలని చాలా ఆతృతగా ఉండేవారట. అయితే సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. చివరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని స్టార్ డైరెక్టర్ గా మారారు.

అలాంటి సమయంలో కృష్ణవంశీని చాలామంది డైరెక్టర్లు ఉపయోగించుకుని.. ఒక రూపాయి కూడా ఆయనకు జీతం ఇచ్చేవారు కాదట. ఆ సమయంలో కృష్ణవంశీ చాలా ఇబ్బందులు పడ్డాడని సమాచారం. పెద్ద నిర్మాతలు, దర్శకులు కూడా డబ్బులు విషయంలో మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సిల్క్ స్మిత మాత్రం అప్పట్లో ఈయనకు ఒక పెద్ద సహాయం చేసినట్లు సమాచారం. ఆ విషయాన్ని ఇప్పటికీ కృష్ణవంశీ మర్చిపోలేరట. 1987లో సిల్క్ స్మిత నిర్మాతగా ఒక సినిమా చేసిందట. ఆ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా కృష్ణవంశీ మొదటిసారి పనిచేశారట.

 

ఈ సినిమా కోసం సిల్క్ స్మిత కృష్ణవంశీకి 500 రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఆయన అన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో కొనసాగినా.. ఎవరు కూడా అంత డబ్బు ఇవ్వలేదట. కానీ మొదటిసారి సిల్క్ స్మిత ఇలా చేయడంతో కృష్ణవంశీ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారట.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చాలా మంది సిల్క్ స్మిత డబ్బులను తీసుకొని ఇతర వాటికి ఉపయోగించుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కృష్ణవంశీ ఆమెతో చెప్పాలనుకున్నా పరిచయం ఎక్కువగా లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారట. అప్పుడే కృష్ణవంశీకి సిల్క్ స్మిత మోసపోతోంది అంటూ తెలుసుకున్నాడట. ఇవన్నీ ఒక ఇంటర్వ్యూలో కృష్ణవంశీ బాధపడుతూ తెలియజేసినట్లు తెలుస్తోంది.