మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు పెరంబుర్ మేజిస్టేషన్ కోర్టులో పెండింగ్ లో ఉన్నది.

മോഹന്‍ലാലിനെതിരായ ആനക്കൊമ്പ് കേസ്: ചോദ്യങ്ങളുമായി ഹൈക്കോടതി, ഹര്‍ജി വിധി  പറയാന്‍ മാറ്റി-Ivory case: Kerala HC raises questions on the government's  plea to stay the trial against ...

అయితే ఈ కేసులను కొట్టివేయాలంటూ మోహన్లాల్ కేరళలోని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ ఫిటిషన్ విచారించిన తర్వాత వచ్చే ఆరు నెలల పాటు మోహన్లాల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు తమ అభియోగాల నుంచి విముక్తి చెందించాలని కూడా పిటిషన్ లో రాసినట్టుగా తెలుస్తోంది. ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో మోహన్ లాల్ కు కాస్త ఊరట లభించిందని తెలుస్తోంది.

మోహన్లాల్ సినిమాలలోనే కాకుండా వ్యాపార రంగంలో కూడా భారీగానే రాణిస్తున్నారు.. ఫిషింగ్, బోటింగ్, రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ పలు రకాల వాటిలో పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పలుసార్లు ఐటి దాడులు కూడా మోహన్లాల్ పైన జరిగాయి. అయితే కొన్ని నెలల క్రితం ఒక కేసు విషయంలో మోహన్లాల్ ఇన్ఫోసిమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కేరళకు చెందిన మోన్సన్ తో సంబంధం ఉన్నాయంటూ వీడి ఆయనకు నోటీసులు ఇచ్చింది మోహన్ లాల్ ను విచారించారట.