మగవారు పెళ్లి చేసుకోవడానికి అసలు… కారణాలు ఏంటో తెలుసా….!!

పెళ్లి చేసుకుంటే అప్పటి వరకు ఉన్న ఫ్రీడమ్ పోతుందని. పార్టీలు, పబ్బులు తిరగడానికి ఉండదని కొంతమంది మగవాళ్లు భావిస్తారు. అందుకే పెళ్లి అంటేనే మగవాళ్లు భయపడతారు. మరికొంతమంది ఇందుకు భిన్నంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒంటరి మగవారికి పొదుపు అంతంతగా ఉంటుంది. వివాహమయ్యాక మగవారు పొదుపు చేయడం నేర్చుకుని డబ్బులని ఎక్కువగా సంపాదిస్తారు. ఇలాంటి వాటి కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

* పెళ్లి చేసుకుంటే సొసైటీలో తనకంటూ ఓ గౌరవం దక్కుతుందని, అందరి ముందు.. ఆ హోదా కోసం మగవారు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ పెళ్లి బంధంతో సొసైటీలో గర్వంగా ఉండాలనుకుంటారు.

* ఆడవారు పిల్లల్ని దత్తత తీసుకుని సింగిల్ పేరెంట్ గా ఉండగలరు. కానీ మగవారు అలా ఉండలేరు. అందుకేతమకంటూ ఓ కుటుంబం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

* చాలామంది మగవారు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా మ్యారేజ్ చేసుకుంటారు. వారికి ఇష్టం లేకపోయినా కేవలం వారి కుటుంబ సభ్యుల కోసం పెళ్లి చేసుకుంటారు.

* మరి కొంతమంది ప్రేమని కోరుకుంటారు. ప్రేమతో ఒకరు జీవితాంతం తోడుగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు.