ఈ రోజు ” గూగుల్ డూడుల్ ” చేంజ్…. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా….!!

ఈ రోజుల్లో దేని గురించి తెలుసుకోవాలన్న గూగుల్ సహాయం తీసుకుంటున్నాం. ఉపాధి, ఆటలు, ఎంటర్టైన్మెంట్, వార్తలు, ఇతర సమాచారం కోసం కోట్లాది మంది గూగుల్ పై ఆధారపడుతున్నారు. ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే వికీపీడియా చదివేస్తున్నారు.

ఆన్లైన్లో అందుబాటులో కొన్ని బుక్స్ సైతం ఉంటున్నాయి. అయితే సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈరోజు ప్రత్యేకమైన డూడుల్ ను ఉంచింది. గూగుల్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా G25gle అనే డూడుల్ ను సెట్ చేసింది. 1998 సెప్టెంబర్ 27న అధికారికంగా గూగుల్ ప్రారంభం అయింది.

ఈ సందర్భంగా గూగుల్ ఓ సందేశాన్ని తెలిపింది. గూగుల్ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ డూడుల్ చేంజ్ అయిన సంకల్పం మాత్రం మారలేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మందికి సమాచారం అందించడంలో తమ పంథా అలానే కొనసాగుతుందని తెలిపింది.