టాలీవుడ్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ అంటే సుపరిచితమే.. ఈయన కుమారుడు మహేష్ బాబు కూడా ఎన్నో చిత్రాలలో నటిస్తు స్టార్ హీరోగా పేరు సంపాదించారు. కృష్ణ కూతురు మంజుల కూడా పలు సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. స్టార్ హీరోల సెలెబ్రెటీ అయినప్పటికీ కూడా సినిమాలలో సక్సెస్ కాలేకపోయింది మంజుల. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కృష్ణ కుమార్తె మంజుల గురించి తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే ..అయితే మంజుల వివాహం గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది.
వాస్తవానికి మంజుల ఒక స్టార్ హీరో కుమారుడిని వివాహం చేసుకోవాలనుకుందట. ఇదే విషయాన్ని తన తండ్రి కృష్ణతో చెప్పడంతో కృష్ణ కూడా అందుకు సానుకూలంగానే వ్యవహరించినట్లు సమాచారం. స్టార్ హీరో కుమారుడితో మంజుల పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట. అయితే అప్పటివరకు కృష్ణ ఏ విధమైనటువంటి జాతకాలను నమ్మేవారు కాదు.. కేవలం మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయంలో జాతకాలను పక్కనపెట్టి మరి ముందడుగు వేసే వారట.
కానీ కూతురు పెళ్లి విషయం వచ్చేసరికి కుటుంబం చెప్పడంతో కాదనలేక స్టార్ హీరో కొడుకు, మంజుల జాతకాలను చూపించారట. కానీ వీరిద్దరి జాతకాలు చూపించడంలో వీరిద్దరి జాతకంలో ఏదో దోషం ఉందని వీరిద్దరికి వివాహం చేసుకుంటే ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలియడంతో కృష్ణ ఈ పెళ్లి చేయకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారట. తన కుమార్తె తనకు సంతోషంగా ఉండడమే ముఖ్యమని హీరో కుమారుడుతో మంజుల పెళ్లి వివాహాన్ని ఆ తర్వాత ఈమెకి వేరే వ్యక్తిని వివాహం చేసిన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఇలా ఆ స్టార్ హీరో తో మంజుల పెళ్లి ఆగిపోవడంతో ఆ స్టార్ హీరో ఇంటికి కోడలు కాలేక పోయింది మంజుల.