ఆ హీరో ఉరి వేసుకుని చ‌నిపోయిన‌ ఇంటిని కోట్లు ఖ‌ర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శ‌ర్మ‌.. ఇదిగో క్లారిటీ!

అందాల భామ అదా శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ బ్యూటీ ఎక్కువ‌గా న‌టించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అదా శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శ‌ర్మ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది.

ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీ త‌ర్వాత అదా శ‌ర్మ బాలీవుడ్ లో బాగా బిజీ అయింది. తెలుగులోనూ ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇక‌పోతే తాజాగా అదా శ‌ర్మ గురించి ఓ షాకింగ్ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. బాలీవుడ్ యంగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అపార్ట్మెంట్ ను అదా శ‌ర్మ కోట్లు పెట్టి కొనుగోలు చేసిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎంఎస్ ధోని సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రియుల మ‌న‌సుల గెలుచుకున్న సుశాంత్.. ముంబయి బాంద్రాలోని మాంట్ బ్లాంక్ అపార్ట్మెంట్ లో ఊరి వేసుకుని సూసైడ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి మ‌ర‌ణం ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ సుశాంత్ డెత్ మిస్ట‌రీగానే ఉంది. ఇక సుశాంత్ చ‌నిపోయిన త‌ర్వాత అత‌డు ఉన్న ఇంటిని అద్దెకు తీసుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. కానీ, తాజాగా అదా శ‌ర్మ ఆ ఇంటిన త‌న సొంతం చేసుకుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ విష‌యంపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను ఏదైన కొన్న..లేదంటే ఏదైనా పనిచేసిన ముందుగా మీడియాతో పంచుకుంటానని, తాను ఎవ‌రి ఇల్లు కొన‌లేద‌ని ఆమె పేర్కొంది. దీంతో సోష‌ల్ మీడియాలో రూమ‌ర్ల‌కు చెక్ ప‌డింది.