బిగ్ బాస్ -7 కంటిస్టెంట్స్ వీళ్లే.. ఎంటర్టైన్మెంట్ డబుల్..!!

బిగ్ బాస్ బుల్లితెరపై రియాలిటీ షోలో సంచలనాలని సృష్టిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది అంటే చాలు టీవీలలో సందడి మొదలైనట్టే.. ప్రతి ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు బిగ్ బాస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Announced: Release Date, Contestants And Everything We  Know So Far

ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకోగా ఇప్పుడు 7వ సీజన్ కూడా రాబోతోంది. అయితే గత 6వ సీజన్లో జరిగిన తప్పులు తెలుసుకుని నిర్వాహకులు సైతం ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేయకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈసారి ప్రేక్షకులకు కచ్చితంగా డబల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో బిగ్ బాస్-7 కంటిస్టెంట్ల లిస్టు వైరల్ గా మారుతోంది.

ఎప్పటిలాగే ఈసారి కూడా నాగార్జున హోస్ట్ చేస్తూ ఉండగా కంటిస్టెంట్ అందరూ కూడా ప్రేక్షకులకు తెలిసిన వారే అన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలె ప్రోమో కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కంటిస్టెంట్లుగా ఎంట్రీ ఇస్తున్న వారిలో సీరియల్ నటుడు అమరదీప్, తన భార్య తేజస్విని.. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కంటిస్టెంట్ నోయల్, తన మాజీ భార్య ఎస్తేర్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కార్తిక దీపం సేమ్ శోభా శెట్టి, యాంకర్ విష్ణు ప్రియ, ఢీ పండు, కాళిదాస్, జబర్దస్త్ అప్పారావు, మోహన్ శోభరాజు, సాయి రోనాక్, నిఖిల్ మరికొందరు ఈ సీజన్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఈ లిస్ట్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఈ షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.