బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నేషనల్ వైడ్ గా ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సన్నీలియోన్ ను ఆమె భర్త డేనియల్ వెబర్ దారుణంగా మోసం చేశాడు. దీంతో వీడియో ప్రూఫ్ తో సహా సన్నీ భర్త బంగారం బయటపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సన్నీలియోన్ తన భర్త డానియెల్ తో దుబాయ్ వెకేషన్ లో ఉంది.
అక్కడి అందాలను అస్వాదిస్తూ వీరిద్దరూ ఫుల్ ఎజాయ్ చేస్తున్నారు. అయితే ఉన్నట్లు ఉండి సన్నీ ఓ వీడియోను పంచుకుంది. అందులో తన భర్త మోసం చేశాడంటూ ఆరోపించింది. అసలేం జరిగిందంటే.. సన్నీ కళ్లుగప్పి డానియెల్ కిచెన్ లో ఐస్ క్రీమ్ లాగించేశాడు. అయితే డానియల్ దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడం విండో అద్దంలో సన్నీ లియోన్ చూసేసింది.
దాంతో సన్నీ అక్కడ ఏం చేస్తున్నావ్? అని భర్తను ప్రశ్నించగా.. వాటర్ తాగుతున్నానంటూ అబద్ధం చెప్పాడు. అప్పుడు `నేను విండో అద్దంలో నిన్ను చూశాను. నువ్వు ఐస్ క్రీం తింటున్నావ్` అని సన్నీ లియోన్ అనడంతో డానియెల్ దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఫన్నీ వీడియోనే సన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి.. బ్యూటిఫుల్ కపుల్, స్వీట్ కపుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram