సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ పెంచుతున్నారు. తాజాగా `ఆరాధ్య` అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
అలాగే ఈ సాంగ్ లో విజయ్, సమంత కెమిస్ట్రీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆ సాంగ్ లోని ఓ సీన్ కారణంగా సమంతకు కొత్త తలనొప్పి మొదలైంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న షాట్ ఉంది. ఈ షాట్ లో విజయ్ తన కాలితో సమంతను తాకుతాడు. దీనిని సినీ ప్రియులు పెద్దగా పట్టించుకోకపోయినా.. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఆ షాట్ ను అడ్డుపెట్టుకుని సమంతను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2013లో వచ్చిన మహేష్ `1. నేనొక్కడినే` గుర్తుండే ఉంటుంది. ఈ మూవీ ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం అయింది.
అయితే ఈ సినిమాలోని `హలో రాక్ స్టార్` సాంగ్ లో మహేష్ అడుగు జాడలను హీరోయిన్ కృతి సనన్ చేతులతో తాకుతున్న షాట్ ను మేకర్స్ అప్పట్లో పోస్టర్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ పై సమంత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 1. నేనొక్కడినే చిత్ర పోస్టర్ మనోభావాలు తెబ్బతీసేలా ఉందని.. కించపరిచే భావం కలిగి ఉందని ట్వీట్ చేసింది. అబ్బాయి కాళ్ళను అమ్మాయి తాకడం స్త్రీలను అవమానించడమే అన్నట్లు సమంత మాట్లాడింది. కానీ, అదే సమంత విజయ్ కాలితో తాకించుకుని అడ్డంగా దొరికిపోయింది. ఇంకేముందు మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం షురూ చేశారు. ఆనాడు మహేష్ చేస్తే తప్పన్న నువ్వు.. ఈ రోజు విజయ్ తో అదే పని చేశావ్.. ఛీ ఛీ సిగ్గులేదా అంటూ సమంతను కడిగిపారేస్తున్నారు.