సుమ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.బుల్లితెరపై లెజెండ్రీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగులో మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది యాంకర్ సుమ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఇండస్ట్రీలోకి అసలు రావాలని అనుకోలేదట. కేవలం తన తల్లి కోరిక ప్రకారమే నటిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత హీరోయిన్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఇప్పుడు యాంకర్ గా మారిపోయింది

తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుమ పలు చిత్రాలలో కూడా సహాయ నటిగా కూడా కనిపించింది. మొదట్లో హీరోయిన్గా చేసిన సుమ అందులో హీరో ఎవరు ఏ సినిమా ఏది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండస్ట్రీలో రైటర్ కం డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఒక్కంతం వంశీ ఈ చిత్రంలో హీరోగా నటించారు ఆ చిత్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు.. ఈ సినిమాని దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.

అయితే ఇందులో హీరోగా ఒక్కంతం వంశీ నటించిన హీరోయిన్లుగా సుమ, కావ్య నటించారు.. ఈ సినిమా 1996లో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేక పోయింది ఆ తర్వాత వక్కంతం వంశీ హీరోగా కాకుండా రైటర్ గా తన కెరీర్ ని కొనసాగించారు. సుమ మాత్రం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదిస్తోంది. ఇక సినిమాలలో కొనసాగుతున్న సమయంలోనే నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి మరి వివాహం చేసుకుంది సుమ ప్రస్తుతం వీరికి ఒక పాప బాబు కూడా ఉన్నారు సుమ కొడుకును కూడా ఇండస్ట్రీలోకి పరిచయం చేస్తోంది.