రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హీరోయిన్..ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా?

ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే హీరోయిన్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది. డైరెక్టర్ లు, నిర్మాతలు వాళ్ళ సినిమాలకు ముందే డేట్స్ బుక్ చేసుకుంటారు. దీంతో హీరోయిన్స్ కూడా వారి రెమ్యునరేషన్ భారీగా పెంచేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ లందరు ఇప్పటికే 3 నుంచి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా రెమ్యునరేషన్ 3 కోట్లకి పెంచిందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కీర్తి సురేష్.

కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటి సినిమాలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. దివంగత మహానటి సావిత్రి నిజజీవిత పాత్రతో కీర్తి జీవించేసింది. ఈ సినిమాకి తన అద్భుతమైన అభినయానికి గానూ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి బిజీ అయిపోయింది. వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ఈ సినిమా తరువాత తెలుగులోనే కాదు తమిళం, మలయాళం భాషల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని రోజులుగా సక్సెస్ లేక కీర్తి కెరీర్ స్లో అయ్యింది. ఆ సమయంలోనే దసరా సినిమా విడుదలైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాని, కీర్తి కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో కీర్తి మహానటి తరువాత తన బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో కీర్తి డ్యాన్స్, నటనకి ప్రశంసల వర్షం కురిసాయి. దసరా సినిమా మొత్తం కీర్తి చుట్టే తిరుగుతుంది. ప్లాప్ లతో ఉన్న కీర్తికి దసరా మంచి విజయాన్ని సాధించి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమా తరువాత ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామనిదన్‌ చిత్రం సక్సెస్‌ అయ్యింది. కీర్తి తరువాత మెగాస్టార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కానుంది

వరుస సినిమాల తరువాత కీర్తి రెమ్యునరేషన్ పెంచేసింది అనే వార్త ఇప్పడు వైరల్ అవుతుంది. ఇంతకు ముందు చిత్రానికి రూ.2 కోట్లు తీసుకుంటున్న ఈ భామ ఇప్పుడు రూ.3 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు కోలీవుడ్‌ లో టాక్ నడుస్తుంది. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.