ఫ్లాప్ టాక్ వచ్చినా.. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన మెగాస్టార్ మూవీ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు 150 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో హిట్, సూపర్ హిట్ గ నిలిస్తే మరికొన్ని సినిమాలు బ్లాక్బస్టర్ హిట్గ నిలిచాయి. అలానే ప్లాప్ అయిన సినిమా లు కూడా కొన్ని ఉన్నాయి. ముందు ప్లాప్ టాక్ తెచ్చుకొని ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా చిరు కేరిర్ లో ఒకటి ఉంది.

ఆ సినిమా మారేదో కాదు ‘ స్టేట్ రౌడీ ‘. బి.గోపాల్ దర్శకత్వం వహించిన స్టేట్ రౌడీ సినిమాలో చిరంజీవి హీరోగా రాధ, భాను ప్రియా హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా లో రావు గోపాల్ రావు, శారద, నూకన్ ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి బప్పిలహరి సంగీతం అందించారు. 1989లో విడుదలైన ఈ సినిమా మొదటి ఆటలో ప్లాప్ టాక్ ని మూటగట్టుకుంది.

మళ్లీ సాయంత్రం జరిగిన షో లో ఆ ప్లాప్ టాక్ కాస్త పాజిటివ్ టాక్ గా మారిపోయింది. దాంతో స్టేట్ రౌడీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మొదలైన దగ్గర నుండి ఇంకో 30 నిమిషాల్లో పూర్తవుతుంది అనేంతవరకు చిరంజీవి స్టేట్ రౌడీ పాత్రలోనే కనిపిస్తాడు. చివరికి అతను ఒక అండర్ కవర్ పోలీస్ అని తెలిసి ప్రేక్షకులు ఖుషి అవుతారు. అన్ని రకాల ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఒక్క నైజం లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది ఈ సినిమా. అలానే చిరు ఇమేజ్ ని ఇంకాస్త పెంచేసింది స్టేట్ రౌడీ సినిమా.