అయ్య బాబోయ్‌.. `బ్రో` ఐటెం సాంగ్‌ కోసం ఊర్వ‌శి అన్ని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ కాంబినేషన్లో ప్రస్తుతం `బ్రో` అనే మల్టీస్టార‌ర్‌ మూవీ తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. థ‌మ‌న్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు.

వచ్చే నెల 28వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్ర‌స్తుతం ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ను హైదరాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు. ఈ స్పెష‌ల్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ ల‌తో చిందేయ‌బోతోంది.

ఈ సాంగ్ షూట్ కోసం హైద‌రాబాద్ లోని ఓ స్టూడియోలో భారీగా ఖ‌ర్చు పెట్టి ఓ ల‌గ్జ‌రీ ప‌బ్ సెట్ వేశారు. ఇప్పుడు ఆ సెట్ లోనే సాంగ్ షూట్ జ‌రుగుతోంది. ఈ సాంగ్ ఏకంగా ఊర్వ‌శి ఏకంగా రూ. 2 కోట్లు ఛార్జ్ చేస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, ఈమె రెమ్యున‌రేష‌న్ క‌లుపుకుని బ్రో ఐటెం సాంగ్ కోసమే మేక‌ర్స్ ఏకంగా ఐదు కోట్ల రూపాయి ఖ‌ర్చు పెడుతున్నార‌ట‌. దీంతో ఇప్ప‌డు ఈ విష‌యం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ స్పెష‌ల్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుంద‌ని మాట్లాడుతుకుంటున్నారు.