బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కిన మైతలాజికల్ విజువల్ వండర్ `ఆదిపురుస్`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటిస్తే.. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న దాదాపు ఏడు వేల థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది.
అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో ఆదిపురుష్ విఫలం అయింది. అభిమానులు మాత్రం సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరిందంటే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మూవీపై విడుదలైన నాటి నుంచి ట్రోల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇదేం రామాయణం అంటూ డైరెక్టర్ ఓం రౌత్ ను ఏకేస్తున్నారు. అయితే తాజాగా ట్రోలర్స్ కు ఓం రౌత్ ఓ రేంజ్ లో ఇచ్చిపడేశాడు.
`ఆదిపురుష లో శ్రీరాముడి పాత్ర కోసం నా వన్ అండ్ ఓన్లీ ఛాయిస్ ప్రభాసే. నేను అనుకున్నట్లే అయినా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటి జనరేషన్ కోసం ఆదిపురుష్ తీశాను. యువత కోసమే ఈ సినిమాను తెరకెక్కించాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్ పై చూపించడం అసాధ్యం. అందుకే నేను యుద్ధకాండను ఎంచుకున్నాను. ఈ అధ్యాయంలో రాముడు పరాక్రమవంతుడుగా ఉంటాడు. నేను కూడా అదే తెరపై చూపించడానికి ప్రయత్నించాను` అంటూ ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ వైరల్ గా మారాయి.