బాలకృష్ణ అందుకున్న తొలి నంది అవార్డు సినిమా ఏంటో తెలుసా..?

బాలయ్య సినీ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న బాలయ్య యంగ్ హీరోల చిత్రాలకు కూడా పోటీగా తన సినిమాలను విడుదల చేసి సక్సెస్ అవుతున్నారు. బాలకృష్ణ సినీ కెరియర్ లో ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. అప్పట్లో బాలయ్య సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సింహ, నరసింహనాయుడు తదితర వంటి ఫ్యాక్షన్ డ్రాప్ చిత్రాలలో నటించారు. రీసెంట్ గా కూడా వీరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు.

NBK - B.Gopal's Industry Hit Narasimha Naidu completes 20 years.

బాలయ్య పుట్టినరోజు జూన్ 10వ తేదీ కారణంగా బాలయ్య అభిమానులు బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాని రీ రిలీజ్ చేయాలని కోరడంతో చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించిందట. బాలయ్య డైరెక్టర్ బి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రావడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య 2001 జనవరి 11న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రూ .20 కోట్ల రూపాయల కలెక్షన్ల వరకు రాబట్టి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిందట.

దాదాపుగా 100,150,200 రోజులు పలు సెంటర్స్ లో ఆడి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది ఈ సినిమాకి కథ మాటలు అన్నీ కూడా పరుచూరి బ్రదర్స్ అందించారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా సిమ్రాన్ ప్రీతి జింగానీయ నటించిన జరిగింది ఈ చిత్రంలోని డైలాగులు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాటలు కూడా అప్పట్లో ఒక ఊపు ఊపేసాయి ఈ సినిమాతోనే బాలకృష్ణ మొదటిసారి నంది అవార్డును అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.