అలనాటి సీనియర్ హీరోయిన్లలో నటి సుమలత సౌత్ టు నార్త్ లో ఎన్నో భాషలలో నటించి దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది.. తెలుగు, తమిళ్, మలయాళం వంటి సినిమాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సుమలత.. చిరంజీవి ,రజనీకాంత్ ,బాలయ్య తదితర హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం కర్ణాటక లోక్సభ ఎంపీగా రాజకీయ రంగంలో తనహవ కొనసాగిస్తోందని చెప్పవచ్చు.. సుమలత స్వర్గీయ అంబరీష్ అభిషేక్ అనే కుమారుడు జన్మించారు తాజాగా సుమలత కొడుకు పెళ్లి చాలా ఘనంగా జరిగింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రసాద్ బీదపా కూతురు అవివాతో నిన్నటి రోజున ఉదయం బెంగళూరులో ఒక ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యి నూతన వధూవరులను సైతం ఆశీర్వదించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామరాజు కూడా హాజరై ఈ జంటను ఆశీర్వదించడం జరిగింది.
అలాగే రజనీకాంత్ ,మోహన్ బాబు నటుడు యష్ తదితర నటీనటుల సైతం హాజరజీ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సుమలత భర్త అంబరీష్ 2018లో మరణించిన విషయం తెలిసిందే ..అంబరీష్ కూడా సినిమాలపరంగా రాజకీయపరంగా మంచి పాపులారిటీ సంపాదించారు. తెలుగులో చిరంజీవి నటించిన శ్రీ మంజునాథం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు అంబరీష్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.