అమెరికాలో అదరగొట్టిన ‘ఆదిపురుష్’ టికెట్ సేల్స్… రేటు ఎంతంటే?

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇపుడు ఎక్కడ విన్నా ‘ఆదిపురుష్’ పేరే వినబడుతోంది. శ్రీ రామ చంద్రునిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసిందే. దాంతో ఇండియాలో ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా? టికెట్స్ బుక్ చేసుకుందామా? అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే… అమెరికాలో ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇకపోతే ప్రతి తెలుగు సినిమా ఇండియాలో కంటే అమెరికాలోనే ముందుగా విడుదల అవుతుందనే విషయం విదితమే. అలాగే ఇప్పుకు కూడా ‘ఆదిపురుష్’ ప్రీమియర్ షోలు అమెరికాలో ముందుగా పడుతున్నాయి. జూన్ 15వ తేదీ ఉదయం 3.30 గంటల నుంచి షోస్ అక్కడ మొదలు అవుతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అమెరికాలో ‘ఆదిపురుష్’ టికెట్టును 20 డాలర్లుకు అమ్ముతున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపు 1600 రూపాయిలు అన్నమాట. ఇది 2డి షో టికెట్ రేటు. త్రీడీ షో అయితే టికెట్ రేటు 23 డాలర్లు వరకు ఉంటుంది.

కాగా రీజనబుల్ రేట్లకు టికెట్స్ అమ్ముతున్నారని ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అదే ‘ఆర్ఆర్ఆర్’ టికెట్స్ 28 నుంచి 25 డాలర్లకు అప్పట్లో అమ్మారు. దాంతో పోలిస్తే ఈ రేటు రీజనబులే కదాని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కాగా ఇటీవల విడుదలైన ‘జై శ్రీరామ్’ పాట, టీజర్ ఇతర ప్రచార చిత్రాలకు ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. ‘ఆదిపురుష్’తో ప్రభాస్ విజయం సాధించాలి! ప్రభాస్ కోసమైనా ‘ఆదిపురుష్’ విజయం సాధించాలని ఆయన అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు.

Share post:

Latest