పెద్ద త‌ప్పు చేసి దొరికిపోయిన శ్రీ‌లీల‌.. చెంప చెల్లుమ‌నిపించిన బాల‌య్య‌!?

నట సింహం నందమూరి బాలకృష్ణకు కాస్త కోపం ఎక్కువ. తన ముందు ఎవరైనా తప్పు చేస్తే క్షణం కూడా ఆలోచించరు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలయ్య చేతిలో తన్నులు తిన్నదని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. పెద్ద తప్పు చేసి దొరికిపోవ‌డంతో శ్రీ‌లీల చెంప చెల్లుమనిపించారట బాల‌య్య‌. అసలు ఏం జరిగిందంటే..

బాల‌కృష్ణ‌, శ్రీ‌లీల `ఎన్‌బీకే 108`లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న‌ సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంటే.. శ్రీ‌లీల కీల‌క‌ పాత్రను పోషిస్తుంది. ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌రవేగంగా జ‌రుగుతుంది. ఇందులో శ్రీ‌లీల చిల్ల‌ర వేశాలు వేసే అల్ల‌రి పిల్ల‌గా న‌టిస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఓ స‌న్నివేశంలో శ్రీ‌లీల అనుకోకుండా పెద్ద త‌ప్పు చేసి బాల‌య్య ఆగ్ర‌హానికి గుర‌వుతుంద‌ట‌. ఆ టైమ్ లో శ్రీ‌లీల‌ను బాల‌య్య లాగి పెట్టి కొట్టాల్సి ఉంటుందట‌. ఇటువంటి స‌న్నివేశాలు నిజంగా ఎవ‌రూ కొట్ట‌రు. కొట్టిన‌ట్లు యాక్ట్ చేస్తారు. అలానే బాల‌య్య చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. కానీ, శ్రీ‌లీల మాత్రం నిజంగానే కొట్టామ‌ని చెప్పింద‌ట‌. అప్పుడే సీన్ న్యాచుర‌ల్ గా వ‌స్తుంద‌ని.. ఎక్స్ప్రెషన్స్ బాగా వ‌స్తాయ‌ని చెప్పింద‌ట‌. దాంతో బాల‌య్య నిజంగానే శ్రీ‌లీల చెంప చెల్లుమ‌నించాడ‌ట‌. మొత్తానికి అలా రీల్ లైఫ్ లో శ్రీ‌లీల బాల‌య్య చేతుల్లో త‌న్నులు తిన్న‌ద‌న్నామ‌ట‌.

Share post:

Latest