ఆ రోజు రూ. 10 వేల కోసం పాట్లు.. ఇప్పుడు కోట్ల‌కు అధిప‌తి.. VD ఆస్తుల లెక్క ఇదే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా రోజురోజుకు ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. లైగ‌ర్ వంటి భారీ డిజాస్ట‌ర్స్ ప‌డిన స‌రే.. విజ‌య్ తో వ‌ర్క్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అయితే విజ‌య్ కు ఈ స్టార్ హోదా అంత సుల‌భంగా ఏమీ రాలేదు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన విజ‌య్.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు పొంద‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. చిన్న చిన్న పాత్ర‌ల కోసం కెరీర్ ను నెట్టుకొచ్చాడు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల అనంత‌రం `అర్జున్ రెడ్డి`తో విజ‌య్ ద‌శ తిరిగింది. ఈ ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ గా అవ‌త‌రించాడు. ఆ త‌ర్వాత ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.

అయితే ఒక‌ప్పుడు రూ. 10 కోట్ల విజ‌య్ నానా పాట్లు ప‌డ్డాడ‌ట‌. అవసరం కోసం ఏ పని అయినా, ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేశాడ‌ట‌. కానీ, ఇప్పుడు విజ‌య్ కోట్ల‌కు అధిప‌తి. ఒక్కో సినిమాకు రూ. 20 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. కేవ‌లం హీరోగానే కాకుండా వ్యాపార‌వేత్త‌గా స‌త్తా చాటుతున్నాడు. అతడి క్లాత్ బ్రాండ్ `రౌడీ`కి బయట ఎంతో ఆదరణ లభిస్తోంది. విజ‌య్ పేరిట ఖ‌రీదైన భ‌వ‌నాలు, స్థలాలు ఉన్నాయి. ఆయ‌న గ్యారేజీలో కోట్లు విలువ చేసే ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. ప‌లు నివేధిక‌ల ప్ర‌కారం విజ‌య్ ఆస్తుల విలువ మొత్తం రూ. 70 నుంచి 80 కోట్ల రేంజ్ ఉంటుంద‌ని తెల‌స్తోంది.

Share post:

Latest